ముందుగా బాల రామాయణం సినిమాతో బాలనటుడిగా చిన్నతనంలోనే తెలుగు సినిమా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి వంశ మూడవ తరం వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ తరువాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన ఎన్టీఆర్, ఆపై స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి తదితర సినిమాల సూపర్ సక్సెస్ లతో మాస్ లో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించాడు.
ఆపై తన టాలెంట్ తో వరుసగా పలు అవకాశాలు అందుకున్న ఎన్టీఆర్, వాటిని మంచి విజయాలుగా మలుచుకుని ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. చిన్నతనం నుండి తండ్రి హరికృష్ణ, తల్లి షాలిని అంటే అమితమైన ప్రేమ గల ఎన్టీఆర్, తన ఎదుగుదలకు తాతయ్య నందమూరి తారకరామారావు గారు, బాబాయి బాలకృష్ణ గారి ఆశీస్సులతో పాటు మా అమ్మ, నాన్నల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని తరచూ చెప్తూ ఉంటారు.
తనకు చిన్నప్పటి నుండి అన్నింటా చేదోడు, వాదోడుగా నిలుస్తూ జీవితంలో మంచి, చెడు లను గురించి అమ్మ షాలిని ఎన్నో గొప్ప మాటలు చెప్పేవారని, అలానే తన కెరీర్ ఒకానొక సమయంలో కొంత ఒడిదుడుకులతో సాగిన సమయంలో కూడా అమ్మ నాకు చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేనని ఎన్టీఆర్ అంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని, ఎందుకంటే కళ్ళు తెరవగానే మనకు కనపడే మొదటి రూపం అమ్మ, మాట రాగానే పలికే మొదటి మాట అమ్మ అని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్తుంటారు. ఆ విధంగా తనకు ప్రస్తుతం ఇంత గొప్ప పేరు, ప్రఖ్యాతలు దక్కడంతో అమ్మ షాలిని పాత్ర ఎంతో ఉందని చెప్పే ఎన్టీఆర్, అమ్మ లేనిదే తాను లేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి