పవన్ కల్యాణ్‌కి హరీష్ శంకర్ వీరాభిమాని. ‘గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్‌లో కట్టే కాలే వరకూ పవన్ అభిమానిగా వుంటానని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్‌ని చూపించి ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఆ సినిమాతో పవర్ స్టార్ రేంజ్ పెరిగిపోయింది. దాదాపు పది సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ హిట్ లభించింది. ఈ సినిమా 2012 లో విడుదలై ఇండస్ట్రీ లో వున్న రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికి కూడా ఈ సినిమా అంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఎయిట్ ఇయర్స్ తరవాత మళ్ళీ పవన్‌ని డైరెక్షన్ చేసే ఛాన్స్ అందుకున్నారు హరీష్ శంకర్. ‘వకీల్ సాబ్’, క్రిష్ డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక, హరీష్ డైరెక్షన్‌లో పవన్ సినిమా చెయ్యనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆ సినిమా స్ర్కిప్ట్ వర్క్‌లో హరీష్ బిజీగా వున్నారు.
‘గబ్బర్ సింగ్’లో ఎంటర్‌టైన్‌మెంట్, హీరోయిజమ్ మీద హరీష్ శంకర్ కాన్సంట్రేట్ చేశాడు. ఈసారి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వుండదని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. పవన్ పొలిటికల్ ఇమేజ్‌కి సంబంధించి స్టోరీలో ఏదైనా వుంటుందో లేదో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని హరీష్ అన్నారు. పవర్‌స్టార్ క్యారెక్టరైజేషన్, సినిమా ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా వుంటాయని ఆయన హమీ ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి