ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ( ఏబీవీ ) సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈ ఏడాదిలోనే పార్టీని పట్టాలెక్కించేందుకు ఆయన కసరత్తు చేస్తుండటంతో, ఇది ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుంది? ఎవరికి ఇబ్బందిగా మారుతుంది? అనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు తన రాజకీయ ప్రణాళికలను స్పష్టం చేశారు.


రాజకీయాల్లోకి రావాలనుకునే ఉత్సాహవంతులైన యువతకు, అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులకు తన పార్టీలో పెద్దపీట వేయనున్నారు. వైసీపీ వంటి పార్టీలు మళ్లీ అధికారంలోకి రాకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. కేవలం కార్పొరేట్ శక్తుల ఎదుగుదల కాకుండా, సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధే తన పార్టీ విధివిధానమని పేర్కొన్నారు. సాధారణంగా కొత్త పార్టీలు వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అధికార పార్టీకి లాభిస్తుందనేది ఒక రాజకీయ సూత్రం. అయితే ఏబీవీ పార్టీ విషయంలో సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి.


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక:
ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ, జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ వంటి వారు చిన్న పార్టీలతో బరిలో ఉన్నారు. ఇప్పుడు ఏబీవీ కూడా తోడైతే, అది కూటమి కి పడాల్సిన ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న ఆందోళన కొందరిలో ఉంది. ఏబీవీ నేరుగా వైసీపీనే లక్ష్యంగా చేసుకున్నారు కాబట్టి, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండే వర్గాలను ఏకం చేసే అవకాశం ఉంది. ఇది వైసీపీకి నష్టమే కలిగిస్తుందని రాజకీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.  ఏబీవీకి ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలో పట్టు ఉండటం వల్ల, అది టీడీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే ఛాన్స్ కూడా లేకపోలేదు.


సవాళ్లు - సామాజిక సమీకరణాలు :
ఏపీలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా రాజకీయాలు నడుస్తున్నాయి. జైభీం పార్టీ (దళిత), బీసీవై పార్టీ (బీసీ) వంటివి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. ఇన్ని పార్టీల మధ్య ఏబీవీ తన 'ప్రత్యామ్నాయ' రాజకీయ వాదనను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి. ఫైన‌ల్‌గా ఏబీవీ రాకతో ఏపీ రాజకీయాల్లో మరో కొత్త కోణం మొదలైంది. ఇది కేవలం వైసీపీకే కాకుండా, ఇప్పుడున్న అధికార కూటమికి కూడా కొత్త సవాళ్లను విసిరే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: