కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఇతర  ఎంటర్టైన్ మెంట్ ఏదీ లేదు కాబట్టి, కొత్త సినిమాలు కూడా రావట్లేదు కాబట్టి బిగ్ బాస్ షో సూపర్ హిట్ అవుతుందని అంచనా వేశారంతా. అనుకున్నట్టుగానే హడావిడిగా బిగ్ బాస్ ని టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే కంటెస్టెంట్ల విషయంలోనే పసలేదని తేలిపోయింది. ఖాళీగా ఉన్నవారందర్నీ తీసుకొచ్చి కంటెస్టెంట్ లు గా పరిచయం చేసి షో మొదలు పెట్టారు. కాస్త హాట్ హాట్ వ్యవహారాలు కూడా నడపాలని చూశారు కానీ ఏదీ వర్కవుట్ అయినట్టు లేదు.

ప్రస్తుతం తెలుగులో కొనసాగుతున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'బిగ్ బాస్' సీజన్ 3 ని సక్సెస్ ఫుల్ గా నడిపిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్ కి రేటింగ్స్ అతి తక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. నాగార్జున కనిపించే శని ఆదివారాలు ఓ మోస్తరు రేటింగ్ వచ్చినా మిగతా వారాల్లో జనాలు అసలు పట్టించుకోవడం లేదట. మరోవైపు ఐపీఎల్ మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈసారి బిగ్ బాస్ కి మాత్రం ఆ స్థాయిలో ఆదరణ లభించలేదు.

'బిగ్ బాస్' సీజన్ 4, కంటెస్టెంట్లను పరిచయం చేసే లాంఛింగ్ ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుని రికార్డ్స్ దక్కించుకుంది. అదే ఊపులో మిగతా ఎపిసోడ్ లు కూడా ఉంటాయనుకుంటే.. ఐపీయల్ క్రికెట్ సీజన్ బిగ్ బాస్ రేటింగ్స్ మొత్తం పట్టుకెళ్లిపోతోంది. మంచి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి పూర్ పరఫార్మెన్స్ ఇస్తున్నవారిని ఇంకా బరిలో ఉంచారనే టాక్ కూడా నడుస్తోంది. స్టార్టింగ్ ఎపిసోడ్ రేటింగ్స్ లిస్ట్ బయటకు చెప్పి హడావుడి చేసిన నిర్వాహకులు ఇప్పుడు సైలెంటుగా ఉండటం కూడా బిగ్ బాస్ సీజన్ 4 ని జనాలు లైట్ తీసుకుంటున్నారు అనడానికి నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద గత ఎపిసోడ్లలాగా బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ కాలేకపోయిందని అర్థమైపోయింది. కరోనా లాక్ డౌన్ సమయాన్ని కూడా బిగ్ బాస్ ఉపయోగించుకోలేకపోయిందంటే.. మామూలు టైమ్ లో ఇదే షో టెలికాస్ట్ అయితే పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: