కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. జనాల్లో భయం పోయింది. రోడ్డు మీదకు వచ్చేశారు. కరోనాను పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్లు చేసేసుకుంటున్నారు. సంక్రాంతి నాటికి కోవిడ్‌ ప్రభావం మరింత తగ్గుతుందన్న వార్త సినిమా వర్గాల్లో సంతోషం నింపింది. దీంతో.. చాలామంది నిర్మాతలు సంక్రాంతిపై ఖర్చీఫ్‌ వేసేస్తున్నారు.

ఇంకా ఎనౌన్స్‌ చేయకపోయినా.. పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌సాబ్‌ కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. ఇప్పటికే షూటింగ్‌ మొదలుపెట్టగా.. నవంబర్‌లో పవన్‌ కళ్యాణ్‌పై సీన్స్‌ చిత్రీకరించి.. సంక్రాంతి నాటికి రెడీ చేస్తారు. వకీల్‌సాబ్‌ కూడా పోటీలో ఉంటే.. సంక్రాంతి బరిలో దిగే పెద్ద హీరో మూవీ ఇదొక్కటే  అవుతుంది.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్ అఖిల్‌ కరోనా తర్వాత షూటింగ్‌లోకి అడుగుపెట్టాడో లేదో... సంక్రాంతినే టార్గెట్‌ చేస్తూ.. నెల క్రితమే ఎనౌన్స్‌ చేశారు. దసరా సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్‌తో పాటు..సంక్రాంతికి రెడీ అంటూ.. హింట్‌ ఇచ్చేశాడు ఈ బ్యాచులర్‌.

షూటింగ్‌ మొదలైందో లేదో సంక్రాంతికి వస్తున్నామంటూ ఎనౌన్స్‌ చేసిన రంగ్‌దే టీం నుంచి... దసరాకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. నితిన్‌, కార్తిసురేష్‌  జంటగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఉంటుందా? లేదా? అనే అనుమానం క్రియేట్‌ చేసింది. దసరాకు కామ్‌గా ఉన్న రంగదే టీం ఎప్పుడొచ్చేది దీపావళికి చెబుతుందేమో చూడాలి. రానా నటించిన పాన్‌ ఇండియా మూవీ అరణ్య కూడా సంక్రాంతికి పోటీ పడే అవకాశం ఉంది.


అనుకున్నట్టే సంక్రాంతికి ఈ సినిమాలన్నీ వస్తే మాత్రం.. గత సంక్రాంతుల కంటే.. ఎక్కువ  క్రాంతితో థియేటర్స్‌ వెలిగిపోతాయి. కరోనా తగ్గుముఖం పట్టి.. ప్రేక్షకులు థియేటర్స్ బాటపడితే మాత్రం గత వైభవం వచ్చినట్టే. 2020లో  మహేశ్‌, బన్నీ సినిమాలు సరిలేరునీకెవ్వరు.. అల వైకుంఠపురంలో చేసిన సందడి తర్వాత మళ్లీ ఆ కళ 2021 సంక్రాంతి తీసుకొస్తుందేమో చూడాలి. మొత్తానికి 2021 సంక్రాంతి.. సినిమా ఇండస్ట్రీలో వెలుగులు తీసుకొస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: