ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ పైన ఉంది. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో నడిచే కాంట్రవర్సీలు... సెలబ్రిటీల మధ్య జరిగే ముచ్చట్లు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మనకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి తమకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు బిగ్ బాస్ హౌస్ పై కన్నేశారూ  ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ.



 వారంలో ఐదు రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ చేసే సందడి.. టాస్కులు.. చిన్న చిన్న గొడవలు అన్ని  కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉండగా ఇక  వారాంతంలో హోస్ట్ గా వస్తున్న నాగార్జున... మరింత ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు  తన పోస్టింగ్ తోనే అందరినీ అలరిస్తూ ఉంటే ఎన్నో డిఫరెంట్ టాస్క్ లతో వారాంతంలో నాగార్జున చేసే సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత వారం ఎవరూ ఊహించని విధంగా దివి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.



 ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అమ్మ రాజశేఖర్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎలివేషన్స్ కోసం నామినేషన్ లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ లో అమ్మ రాజశేఖర్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.  దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. కాగా నేడు జరగబోయే బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా ఎవరు వస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: