తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అంటే కూరలో కరివేపాకులాగా చూస్తారు. హీరో పక్కన పాటలు పాడేందుకు, హీరోని ప్రేమలో పడేయడానికి నానా తిప్పలు పడేందుకు మాత్రమే హీరోయిన్ పాత్రని ఎలివేట్ చేస్తుంటారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ని పక్కనపెడితే, తెలుగులో స్టార్ హీరోలు నటించే.. ఫక్తు కమర్షియల్ మూవీస్ అన్నిటికీ ఇదే ఫార్ములా. అయితే.. ఎక్కడో ఒకచోట త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్లు మాత్రం తమ సినిమాల్లో హీరోని ఎలివేట్ చేస్తున్నా.. హీరోయిన్లకి కూడా మంచి పాత్రలు ఇస్తుంటారు. అలాంటి కొరటాల శివ, చిరంజీవి దగ్గరకు వచ్చే సరికి హీరోయిన్ క్యారెక్టర్ ని పూర్తిగా బలి చేస్తున్నారు.
ఆచార్య సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషను ఎంపిక చేసుకున్నారు. అయితే ఎందుకో త్రిష అర్థాంతరంగా సినిమానుంచి తప్పుకుంది. కారణం పూర్తిగా చెప్పకపోయినా సినిమాలో తన పాత్ర బాగాలేకపోవడం వల్లే త్రిష బైటకొచ్చేసిందని, చిరంజీవి సినిమా అయినా సరే తనకి గుర్తింపునిచ్చే పాత్ర కావాలని చెప్పినట్టు వార్తలొచ్చాయి. అంటే ఆచార్యలో హీరోయిన్ కి పెద్ద ప్రాధాన్యం ఉండనే విషయం అర్థమైంది. ఆ తర్వాత చిరంజీవి సరసన కాజల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. షూటింగ్ కొంత భాగం జరిగిన తర్వాత లాక్ డౌన్ వల్ల గ్యాప్ వచ్చింది. తీరా ఇప్పుడు షూటింగ్ తిరిగి ప్రారంభమైనా కాజల్ సెట్స్ లోకి రాలేదు.

సిినిమా చేతిలో ఉన్నా కూడా కాజల్ ధైర్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లిందంటే.. ఈ సినిమాని, అందులో పాత్రని కాజల్ ఎంతగా లైట్ తీసుకుందో అర్థమవుతోంది. ఆచార్య సినిమాలో హీరోయిన్ పాత్ర పెద్దగా లేదని, ఉన్నా.. అది కేవలం హీరో ఎలివేషన్ కి మాత్రమే పనికొస్తుందని అంటున్నారు. దీన్ని పూర్తిగా హీరో ఓరియంటెడ్ మూవీగా తీర్చిదిద్దుతున్న కొరటాల శివ, హీరోయిన్ పాత్రని పక్కనపెట్టేశారు. అందుకే త్రిష సినిమానుంచి బైటకి వచ్చేసిందని, ఇప్పుడు కాజల్ హీరోయిన్ గా ఉన్నా కూడా సినిమాని లైట్ తీసుకుందని అంటున్నారు. మొత్తమ్మీద ఆచార్య విడుదలైతే కానీ.. అసలు విషయం బైటకొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: