కరోనా బ్రేక్ తర్వాత మొదలైన తెలుగు చిత్రాలు అంత వేగవంతంగా అయితే పూర్తి కావట్లేదు.. ఎదో ఆఖరి దశలో ఉన్న సినిమాలు అయితే పూర్తి అయ్యాయి కానీ డెబ్భై శాతం అయినా సినిమాలు నల్లేరు మీద నడకలా సాగిపోతున్నాయి.. ఈ సంక్రాంతి కి రిలీజ్ అవుతాయన్న ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు ఆ సమయానికి రిలీజ్ కానట్లుగానే కనిపిస్తున్నాయి.. చిరంజీవి ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది.. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మొదట్లో వార్తలు వచ్చినా ఇప్పుడు షూటింగ్ లేట్ అవుతున్న కొద్దీ ఆ టైం రిలీజ్ కి అంచనాలు పెటుకోవద్దనేది తాజా సమాచారం..

ఇక ఎప్పటినుంచో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమా కూడా సంక్రాంతికి కాదుకదా కనీసం వేసవి కి కూడా రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడంలేదు. సాహూ సినిమా తో పాటు మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అభిమానులకు సందేహాలు కలుగుతున్నాయి..  సాహో తరవాత ఇంతవరకు తన సినిమా ను రిలీజ్ చేయకపోవడం అభిమానులకు కోపం తెప్పిస్తూ ఉంది.. బాహుబలి తరువాత మరో హిట్ కోసం ఆకలిగా ఉన్న ఫాన్స్ కి సాహో నిరాశ నే మిగిల్చింది.. దాంతో రాధే శ్యామ్ అయినా వారికి ఫుల్ మీల్స్ పెడుతుందేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల రోజు రోజుకు లేట్ అయిపోతుండడంతో వారిలో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, అయినా ఇంకా రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఒకింత నిరాశను వెల్లడిస్తున్నారు. మొత్తానికి చిరు ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ లు ఈ సంక్రాంతికి రావని డిసైడ్ అయిపొయింది.  వకీల్‍ సాబ్‍, నారప్ప, టక్‍ జగదీష్‍, లవ్‍స్టోరీ తదితర చిత్రాలు మాత్రమే ఈ సంక్రాంతి కి ఖాయంగా విడుదలవుతాయి. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా వేసవి లో రావచ్చునని సంకేతాలు అందుతున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట సినిమాలు వచ్చే ఏడాది దసరాకి కూడా రావచ్చునని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: