అనేక అడ్డంకులు దాటుకుని ‘ఎఫ్ 3’ సినిమాను వచ్చే జనవరి నుండి మొదలు పెట్టాలని భావిస్తున్న దిల్ రాజ్ కు మరో సమస్య అడ్డంకి గా మారింది వార్తలు వస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఎట్టకేలకు పూర్తి చేసిన స్క్రిప్ట్ దిల్ రాజ్ కు పూర్తిగా నచ్చడంతో ఈమూవీని సెట్స్ పైకి తీసుకురావడానికి దిల్ రాజ్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  


ఈమూవీలో తిరిగి వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండటంతో మొదట వెంకటేష్ నుండి ఈ సినిమాకు  సమస్యలు మొదలు అయ్యాయ. ఈ మూవీ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం  కావాలి అని సురేష్ బాబు పట్టు పట్టడంతో ఈ సున్నిత సమస్యను దిల్ రాజ్ తెలివిగా పరిష్కరించుకున్నాడు అని అంటారు.  


ఈ సినిమాకు సంబంధించి లాభంలో వాటాతో పాటు వెంకటేష్ కు 13 కోట్ల పారితోషికం  ఇచ్చేలా ఎగ్రిమెంట్ జరిగింది అని అంటారు. వెంకటేష్ సమస్యలు తీరిపోయాయి అని దిల్ రాజ్ ఆనంద పడుతున్న సమయంలో ఇప్పుడు మరొక సమస్య ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న వరుణ్ తేజ్ నుండి మరో సమస్య వచ్చింది అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో నటించినందుకు వరుణ్ తేజ్ వెంకటేష్ తో సమానంగా తనకు కూడ పారితోషికం కావాలి అని అడుగుతున్నట్లు టాక్.


మూవీ కథ రీత్యా మరొక హీరో కావాలి ఇప్పుడు ఆ పాత్ర కోసం పేరున్న మరొక హీరోను వెతకాలి అంటే అతడు ఎంత పారితోషికం అడుగుతాడు అన్నభయం దిల్ రాజ్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనీల్ రావిపూడి కి ఈమూవీకి సంబంధించి పారితోషికంతో పాటు లాభాలలో వాటా కూడ దిల్ రాజ్ ఇస్తున్న పరిస్థితులలో ఇంతమందికి వాటాలు పంచిన తరువాత ఇక దిల్ రాజ్ కు ఏమి మిగులుతుంది అంటూ కొందరి కామెంట్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: