బుల్లి తెరపై ఒకప్పుడు బాల నటులు గా అలరించిన వారు ప్రస్తుతం వెండి  తెరపై మంచి క్రేజ్ వున్న నటులు గా  కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరపై ఒకప్పుడు ధారావాహికలలో  అలరించి ప్రస్తుతం వెండి తెరపై కూడా హీరోయిన్గా సంపాదించుకుని వరుస అవకాశాల తో దూసుకు పోతుంది చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన అవిక గోర్ ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


 ఇక మొదటి సినిమా తోనే తన అందం అభినయం తో ఆకట్టుకుంది అవికాగోర్. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి అంతగా ఉపయోగ పడలేదు అని చెప్పాలి. ఇక ఇటీవల హారర్ కామెడీ సినిమా రాజు గారి గది 3 సినిమాలో కూడా నటించింది అవికాగోర్. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకి కాస్త ప్రశంసలు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు అనే చెప్పాలి అయితే ఈ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న  ఈ అమ్మడు మరోసారి రీ ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమైంది. అక్కినేని నాగచైతన్య సరసన నటించేందుకు ఓకే చెప్పిందట అవికా గోర్.


 విక్రమ్ కుమార్ నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ పాత్రలో అవికా గోర్ ను తీసుకున్నారట . ఇక ఈ సినిమా కథ నచ్చడం తో వెంటనే అవికాగోర్ ఓకే చెప్పేసిందట. త్వరలో చిత్ర యూనిట్ తో కలిసి షూటింగ్ లో పాల్గొననుందట  ఈ అమ్మడు. మరో హీరోయిన్ సెలక్షన్ కోసం ప్రస్తుతం చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: