సాధారణంగా సినీ సెలబ్రిటీల కు సంబంధించి ఏదైనా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది అంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు వాడే వస్తువుల గురించి..  వాటి ధర గురించి ఏదైనా విషయం బయటకు వస్తే అది మీడియాకు ఫుల్ మీల్స్ లాగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . గతంలో కొంత మంది బాలీవుడ్ సెలబ్రెటీ కి సంబంధించిన డ్రెస్ ధరల గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ధర తెలిసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని వారి గురించి ఒక వార్తా వైరల్ గా మారిపోయింది.



 సాధారణంగానే టాలీవుడ్ లో అక్కినేని వారి కోడలు సమంత కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది అనే విషయం తెలిసిందే. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతూన్నా  క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇక పెళ్లి తర్వాత మరింత జోష్ తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది సమంత. అయితే ఇటీవలే సమంత ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే ఎయిర్ పోర్టులో సమంత దర్శనం ఇవ్వగా ఫోటోగ్రాఫర్లు సమంత ఫోటోలు క్లిక్ మనిపించారు.  ఈ క్రమంలోనే సమంత చేతిలో ఉన్న బ్యాగ్ అందరినీ ఆకర్షిస్తోంది.




 ఇక సమంత చేతిలో ఉన్న బ్యాగ్  ధర ఏకంగా 2 లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రస్తుతం ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే అంత ఖరీదైన బ్యాగ్ సమంత చేతిలో మరింత అందంగా ఉంది అంటూ ప్రస్తుతం ఎంతో మంది అభిమానులు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  ఇటీవలే సమంత కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే విగ్నేష్ శివన్  దర్శకత్వంలో రూపొందుతున్నకాదు కాతువాకుల రేండ్ కాతాల్  అనే సినిమాలో నటిస్తుంది సమంత. ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడిగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: