తాగుబోతు రమేష్ పాడితే... తాగుబోతు పాటపాడినట్టు ఉంటుందా... లేక ప్రేమగీతమా... విరహ గీతమా... విషాద గీతమా... ఇలా చాలా సందేహాలు వస్తాయి. ఇంతకీ, తాగుబోతు రమేష్ పాటపాడుతున్నది ఏ సినిమాలోనో తెలుసా... ‘అతడు... ఆమె... ఓ స్కూటర్’ సినిమాలో. ఇందులో హీరోగా కనిపించబోయేది వెన్నెల కిషోర్. ‘ఎన్టీయార్, ఏయన్నార్, శోభన్ బాబు వంటి పాతకాలపు నటుల ఫ్యాషన్ పోకడలన్నీ మళ్లీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడాలి. కిషోర్ పాత్రలానే రమేష్ పాట కూడా వెరైటీగా ఉంటుంది’ అంటున్నారు సినిమా నిర్మాతలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: