గత వారం విడుదలైన ‘ఉప్పెన’ వీకెండ్ పూర్తి అయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల కలక్షన్స్వసూలు చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని సెంటర్లలో మూడవరోజు కలక్షన్స్ కు సబంధించి గత సంవత్సరం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కన్నా ఎక్కువ కలక్షన్స్ రాబట్టడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈమూవీ కలక్షన్స్ ఈ వారాంతానికి 40 కోట్ల స్థాయికి దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.


ఈమూవీ పై ఇండస్ట్రీ ప్రముఖులు అందరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మెగా యంగ్ హీరోలు వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ నిహారికలు స్వయంగా రంగంలోకి దిగి ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈమూవీ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నా అల్లు అర్జున్ ఇంత వరకు ఈమూవీ పై ఎందుకు స్పందించలేదు అంటూ ఇండస్ట్రీలోని కొందరు తమ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.


ఈ మూవీకి బన్నీకి అత్యంత ఆత్మీయుడైన సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ ఆద్వర్యంలో నిర్మింపబడ్డ విషయం తెలిసిందే. దీనికితోడు బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఇంత సాన్నిహిత్యం అన్ని విషయాలా ఉండి కూడ బన్నీ ‘ఉప్పెన’ పై మౌనం వహించడం వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.


మరికొందరైతే ఈ విషయం పై మరొక విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ‘ఉప్పెన’ మూవీని ప్రశంసిస్తూ ప్రశంసలు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ఈ హడావిడి అంతా పూర్తి అయ్యాక నెమ్మదిగా తీరిక చేసుకుని ‘ఉప్పెన’ పై స్పందిద్దామని బన్నీ భావించి ఉంటాడు అంటూ మరికొందరు బన్నీ మౌనానికి అర్థాలు చెపుతున్నారు. సాధారణంగా ఏ కారణాలు లేకపోయినా అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ ల మధ్య చిచ్చుపెట్టే ఊహాగానాల హడావిడి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడ అదే మాదిరిగా చిన్న విషయాన్ని భూతద్ధంలో చూస్తూ బన్నీ మౌనానికి రకరకాల అర్థాలు వెతుకుతున్నారు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: