నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక "జెర్సీ" లాంటి మాస్టర్ పీస్ తరువాత 'నానీస్ గ్యాంగ్ లీడర్' 'వి' వంటి చిత్రాలతో ముందుకు వచ్చి వరుస ప్లాపులు మూటకట్టుకున్న నాని.. ఇప్పుడు ఎలాగైనా మంచి సాలిడ్ హిట్టు కొట్టాలని శివ నిర్వాణ డైరెక్షన్లో 'టక్ జగదీష్', సినిమా రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్లో 'శ్యామ్ సింగ రాయ్' వంటి చిత్రాలు చేస్తున్నాడు. ఇవి రెండు డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కుతున్న డిఫరెంట్ జోనర్ మూవీస్ కాబట్టి వీటిపై మంచి హైప్ ఏర్పడింది. అందుకే వీటితో ఎలాగైనా మంచి హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని నాని ట్రై చేస్తున్నాడు.వీటిపై ఎంతో నమ్మకంగా వున్నాడు కూడా..ఇదిలా ఉండగా.. నాని ప్రస్తుతం తన పారితోషికాన్ని పెంచేసినట్టు తాజాగా సమాచారం అందుతుంది.


కరోనా వైరస్ కారణంగా నిర్మాతలకు చాలా నష్టాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి టైములో హీరోలు పారితోషికాలు తగ్గించుకుని వాళ్లకు అండగా నిలబడతారు అని అంతా అనుకుంటే…పరిస్థితి ఏంటో తెలిసి కూడా నాని ఇలా చెయ్యడం పై  ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది.ఇప్పటివరకూ నాని ఒక్కో సినిమాకి రూ.10.5 నుంచి రూ.11 కోట్లు వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. కానీ ఇప్పుడు ఏకంగా రూ.14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం అందుతుంది. నాని సినిమాలకు నాన్ థియేట్రికల్స్ రూపంలో..అంటే హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఎక్కువ వసూళ్లు వస్తుంటాయట. అందుకే నాని తన పారితోషికాన్ని పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. 'మైత్రి మూవీ మేకర్స్' వారితో చెయ్యబోతున్న 'అంటే సుందరానికి' చిత్రం నుండీ నాని ఇంత పెద్ద పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న ఈ చిత్రం ద్వారా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా తెలుగులో స్ట్రెయిట్ హీరోయిన్ గా పరిచయమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: