ఇండస్ట్రీలోకి వచ్చాక అభిషేక్‌కు హిట్స్ వేసవికాలంలో వర్షాలు తరహాలో అప్పుడప్పుడు కనిపించాయి. దీంతో ఫ్లాప్లతో కెరీర్ సాగుతున్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక సినిమాల నుంచి తప్పుకోవాలని భావించాడట అభి.పరిశ్రమలోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని అనుకున్నాడట. అంతేకాదు ఆ విషయాన్ని తండ్రి అమితాబ్ బచ్చన్‌కు కూడా చెప్పాడట. 'నేను సినిమాల్లో నటించడానికి అర్హుణ్ని కాదు' అంటూ ఆవేదనతో చెప్పాడట. ఆ మాట విన్న అమితాబ్ 'నువ్వు ఓడిపోవాలని నిన్ను పెంచలేదు. బతతకడానికి పోరాడాలి' అని అన్నారట. అంతేకాదు 'నటుడిగా ప్రతి సినిమాకు నీవు మెరుగవుతున్నావు' అని కూడా చెప్పారట.
అమితాబ్ మాటలు విన్న అభిషేక్‌కు కాస్త ఆత్మవిశ్వాసం పెరిగిందట. అందుకే ఇంకా చిత్రసీమలో కొనసాగుతున్నాడట అభిషేక్ బచ్చన్. అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తండ్రి స్థాయి స్టార్ ఇమేజ్ ని అందుకోలేకపోయాడు. ఇక ఇటీవలే 'ది బిగ్ బుల్' సినిమాతోటి వచ్చాడు. ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. భవిష్యత్తులోనైనా అభిషేక్ హిట్స్ అందుకోవాలని ఆశిద్దాం.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి