నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల 20వ తేదీన అనగా మే 20న తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే ఇంకా తారక్ బర్త్ డే కి నెల రోజుల సమయం ఉందనగా.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా అప్పుడే ట్రెండ్ ప్రారంభించారు. 'ఫ్రీ బర్తడే ఫెస్ట్' హ్యాష్ ట్యాగ్ పేరిట జూ. ఎన్టీఆర్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ హీరోగా నటించిన అశోక్(2006) చిత్రంలోని ఒక స్టిల్ ని అభిమానులు వైరల్ చేయడం ప్రారంభించారు. ఈ స్టిల్ లో జూనియర్ ఎన్టీఆర్ డెనిమ్ దుస్తుల్లో చేతిలో గన్ పట్టుకొని సీరియస్ గా చూస్తున్నారు.


నిజానికి ఈ యాక్షన్ సినిమాకి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ మేకోవర్ కోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పట్లో అశోక్ లుక్ ట్రెండీ గా కనిపించింది. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ.. నటన పరంగా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే అప్పటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నడంతో ఫ్యాన్స్ కి నాస్టాల్జియా ఫీలింగ్ కలుగుతోంది. "అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్" అనే ట్రెండ్ కూడా ఏప్రిల్ 30వ తేదీన స్టార్ట్ చేసేందుకు అభిమానులు అప్పుడే ప్లాన్ చేసుకున్నారు.



ఇదిలా ఉండగా తారక్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో కలిసి తన 30 చిత్రాన్ని తారక్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్, నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా తో కలిసి తన 31వ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ లతో ఎన్టీఆర్ సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తారక్ బుల్లితెరపై కూడా సందడి చేయనున్నారు. "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే బిగ్గెస్ట్ రియాల్టీ షో ద్వారా ఆయన అభిమానులను అలరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: