సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తన నటనతో తన అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఉంటారు.  మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకర్షిస్తూ  ఉంటారు. ఇలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఎక్కువగా ఆకర్షించిన హీరోయిన్ రీతూ వర్మ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.



 ఇక తన అందం అభినయంతో ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక మొదటి సినిమా అయినా పెళ్లి చూపులు కూడా మంచి విజయాన్ని సాధించింది.  అయితే పెళ్లి చూపులు సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్ లో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ .. దీంతో కన్నడ మలయాళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది  అక్కడ వరుస అవకాశాలు రావడంతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయింది.  ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది



 నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంతే కాకుండా వరుడు కావాలి అనే సినిమాలో కూడా నటిస్తుంది రీతు వర్మ. ఇక ఇటీవల తన కెరీర్ గురించి తాను ఎంచుకున్న పాత్రలు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో తాను నటించిన రెండు సినిమాలు కూడా విడుదల కు సిద్ధంగా ఉన్నాయి ఇవి రెండూ కూడా ఫ్యామిలీ కథా చిత్రాలే అంటూ రీతూవర్మ తెలిపింది. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాల్లో నటించడమే తనకు ఇష్టమని అందుకే.. కుటుంబ కథ నేపథ్యంతో ఉండి ఇక అటు కథ బలంగా ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను అంటూ చెప్పింది రీతు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: