అలా చాలా యాక్షన్ సినిమాల్లో నటించి మెప్పించిన బాలకృష్ణ కెరీర్లో సమరసింహా రెడ్డి సినిమా ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ మీద అప్పటి వరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా తొలగిపోయి పూర్తి మాస్ హీరో ఇమేజ్ వచ్చేలా ఈ సినిమా ఎంతగానో దోహదపడింది. అంతేకాదు అప్పటివరకు తెలుగు సినిమా మూస పోకడను పూర్తిగా మార్చి వేసిన సినిమా సమరసింహా రెడ్డి. సెంటిమెంట్, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.
1999 జనవరి 13 న సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్ గా నిలువగా కేవలం 6 కోట్లతో రూపొందించిన ఈ సినిమా 22 కోట్లు సంపాదించింది. సిమ్రాన్, అంజలి జవేరి, సంఘవి హీరోయిన్లు గా నటించగా విజయేంద్రప్రసాద్ ఈ కథను సమకూర్చడం విశేషం. సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట్రావు నిర్మించిన ఈ సినిమాకి పరుచూరిబ్రదర్స్ మాటలు అందించగా మణిశర్మ సంగీతం అందించారు. బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటికీ చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే సమరసింహా రెడ్డి అంటారు నందమూరి అభిమానులు. ఈ సినిమా తర్వాత ఈ తరహా లో చాలా సినిమాలు తెలుగు తెరపైకి వచ్చి హిట్ గా నిలిచాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి