ఈ మేరకు తన భార్యతో విడాకులు తీసుకోబోతున్న విషయాన్ని అమీర్ ఖాన్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ అంశాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. పెద్ద చర్చనే లేవనెత్తారు ఈమె. పంజాబ్ లోని ఎన్నో కుటుంబాలు ఒక కుమారుడిని సిక్కుగా పెంచితే, మరొక కొడుకును ముస్లిం గా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ విషయానికి వస్తే ఈయన ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన పిల్లలు మాత్రం ఎందుకు ముస్లింగా గుర్తించబడుతారనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఒక మహిళ ఎందుకు హిందువుగా కొనసాగే అవకాశం లేదు. ప్రపంచం ఎంతగానో ఆధునీకరణ చెందుతోంది. మారుతున్న కాలంతో పాటు ఈ పద్దతిని కూడ మనం మార్చాలి. ’ అంటు మతాల గురించి మాట్లాడుతూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్. ఇలా తనకు సంబంధం లేని విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎటువంటి పరిణామాలను ఎదుర్కోనుందో చూడాల్సి ఉంది. కాగా దీనిపై ఇతర మతాలు మరియు అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి