సీని ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది న‌టులు వ‌స్తుంటారు. కానీ వారిలో కొంత‌మంది మాత్ర‌మే పేక్ష‌కుల హృదాయాల్లో నిలిచిపోతారు. అలాంటి వాడే  లెజెండ‌రీ హీరో దిలీప్ కుమార్. బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవార్డు పొందిన న‌టుడు అనారోగ్య స‌మ‌స్య‌తో తుదిశ్వాస విడిచాడు.
ఒక‌ప్ప‌టి బాలీవుడ్ స్టార్ లెజెండ‌రీ హిరో దిలీప్ కుమార్ బుధ‌వారం మ‌ర‌ణించారు.   కొద్ది రోజులుగా శ్వ‌స సంబంధిత స‌మ‌స్య‌తో హిందుజా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 98 ఏండ్ల దిలిప్ కుమార్  ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణానికి బాలీవుడ్
సీని ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

దిలీప్‌కుమార్ బ్రిటీష్ ఇండియా పెషావర్లో అయేషా బేగం, లాల్ గులాం సర్వర్ దంపతులకు డిసెంబర్ 11, 1922లో జన్మించారు. వారు 12 మందికి సంతానం,దిలీప్ కుమార్ 1944లో విడుదలైన జ్వర్ భాట సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. చాలా సినిమా త‌రువాత 1947లో విడుదలైన జుంగు ఆయనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. అలాగే 1948లో విడుదలైన షహీద్, మేళ అనే చిత్రాలు హిట్ సినిమాలు హిట్ ఇచ్చాయి.   1949లో విడుదలైన అందాజ్ నటుడిగా దిలీప్ కుమార్ కి పెద్ద బ్రేక్ . ఆ మూవీలో  రాజ్ కపూర్, నర్గిస్ కూడా ప్రధాన రోల్స్ చేశారు.  త‌రువాత  దిలీప్‌కుమార్ కు ష‌బ్న‌మ్ మూవీ భారీ విజ‌యం అందించింది.

అంతేకాదు. అత్యధిక సినిమా అవార్డ్స్ అందుకున్న నటుడిగా దిలీప్ కుమార్ రికార్డు సొంతం చేసుకున్నాడు. చ‌ల‌న చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్ర‌భుత్వం పద్మ విభూషణ్ అందించి స‌త్క‌రించింది.  భారత సినిమా అవార్డ్స్ లో అత్యున్నతమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఎనిమిది సార్లు ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డు , 2000 నుండి 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: