ప్రిన్స్ కూడా భాగస్వామ్య పద్ధతిలో నిర్మాతగా మారారు. ప్రభాస్ తన యూవీ క్రియేషన్స్ తో సినిమాలు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థకు తోడుగా నిలిచి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మాస్ మహారాజా రవితేజ కూడా వచ్చి చేరడం విశేషం. అయితే తాను డైరెక్ట్ గా కాకుండా తన సన్నిహితుడు, సుదీర్ఘ కాలంగా తన వెంట నమ్మకంగా నడుస్తున్న శ్రీనివాస్ ను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రానున్న రోజుల్లో తన తదుపరి చిత్రాలను తన ఆత్మీయుడు శ్రీనివాస్ నిర్మాణంలోనే తెరకెక్కించే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారట రవితేజ.
ఈ రకంగా తనతో సుదీర్ఘకాలం విశ్వాసంతో ప్రయాణించిన శ్రీనివాస్ కు మేలు జరుగుతుంది. ఒకరకంగా తనకి మంచి పేరు ఫలితముంటుందని అనుకుంటున్నారట రవితేజ. అయితే రవితేజ ప్రోత్సాహంతో శ్రీనివాస్ నిర్మాతగా మారి ఏ రేంజ్ లో సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి. పేరుకి శ్రీనివాస్ నిర్మాత అయినప్పటికీ భారమంతా రవితేజాదే అని తెలిసిందే. అయితే ఈ కొత్త అవతారం ఈమేరకు మంచి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక క్రాక్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన మన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పేష్టుహం ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి