టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహం అనుబంధం ఏవిధంగా గా నెలకొని ఉంటాయో ఎవరికీ తెలియదు. అందరూ చూస్తుండగా వారు మాట్లాడుకోపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఒకరికొకరు అండగా ఉంటారు మన హీరోలు. అలాగే పక్కపక్కనే షూటింగ్ లు జరుగుతున్న సమయంలో ఒకరి సెట్స్ కి మరొకరు వచ్చి ఆ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో తిలకిస్తూ ఉంటారు. ఆ విధంగా రంగస్థలం సినిమా లో చిట్టిబాబు గా అదరగొట్టిన రామ్ చరణ్ తేజ్ శ్రీమంతుడు సినిమాలో తన నటనతో దుమ్మురేపిన మహేష్ బాబు ఓ సినిమా సెట్స్ లో కూర్చుని మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నిజ జీవితంలో కూడా వీరు మంచి స్నేహితులు గా ఉంటారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో ఫ్యామిలీ పార్టీలలో ఇంకా ఇతర ప్రైవేట్ పార్టీ లలో కూడా కలుసుకుంటూ తమ మధ్య స్నేహబంధాన్ని చెబుతూ ఉంటారు. వీరి భార్య లు నమ్రత, ఉపాసన లు కూడా అంతే సన్నిహితంగా మెలుగుతూ ఒకరితో ఒకరు కలిసి పోయి కుటుంబాలుగా మెదులుతూ ఉంటారు. వీరిద్దరి కలయికలో సినిమా చూడాలనే అభిమానుల కోరిక అయితే నెరవేరలేదు కానీ వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఒక ఫోటో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతుండగా దానితో సంతృప్తి పడుతున్నారు ప్రస్తుతానికి.
వీరిద్దరు ఎదురెదురుగా కూర్చుని దేనిగురించో తీవ్రంగా చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ ఫోటోలో. హీరో ఆది పినిశెట్టి వీరిని తీక్షణంగా గమనిస్తు ఉన్నాడు. ఈ ఫోటో రంగస్థలం సినిమా షూటింగ్ సమయంలో తీసినదిగా వారి వారి వేష ధారణలను బట్టి తెలుస్తుంది. అదే టైంలో మహేష్ భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. చిట్టిబాబు గెటప్ లో చరణ్ కనిపిస్తుండగా సీఎం భరత్ వేషధారణలో మహేష్ ను మనం ఈ ఫొటోలో చూడవచ్చు. భరత్ అనే నేను సినిమా లో ప్రెస్ మీట్ సీన్ లో మహేష్ ఇదే డ్రెస్ తో కనిపిస్తారు. బహుశా ఆ సీన్ షూట్ చేసే సమయం లో వీరిద్దరూ ఒకే దగ్గర షూట్ చేస్తూ ఉంటున్నారు కావచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి