హీరో ధనుష్ కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లలో కూడా నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇలా ఆయన సినిమాలను ఆదరించే వారి సంఖ్య పెరిగిపోయింది. అలా కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. #10MillionFollowersForDhanush అనే అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం నరేన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయకు 43వ చిత్రం. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ధనుష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి అట్రాంగి రేలో నటించారు. ఇక టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ధనుష్.. తన కెరీర్ ను తానే మలుచుకున్నారు. చూడటానికి అందంగా లేకపోయినా.. తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచున్నారు. ఇప్పుడు తిరుగులేని హీరోగా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి