సినిమా ఇండస్ట్రీలో విజయం అనేది భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. ఎవరైనా సక్సెస్ సాధిస్తేనే వరుస అవకాశాలు వస్తాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ బ్యూటీ వైపు ఎవరూ చూడరు. ఇక ఆ ముద్దుగుమ్మ కెరీర్ చివరి దశకు చేరుకుందనే చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి పొజిషన్ లోనే ఉన్నారు. అర్జంట్ గా హిట్ కొడితేనే.. లేకపోతే ఇక వాళ్ల కెరీర్ అంతే.

టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి' లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుంది. అయితే 'సైజ్‌ జీరో, నిశ్శబ్ధం' లాంటి సినిమాలు ఆమెను నిరాశపరిచాయి. పైగా విపరీతంగా బరువు పెరిగిపోవడంతో అవకాశాలు దూరమవుతూ వస్తున్నాయి. ఈ మాటలతోనే స్వీటీ సినిమాలకి కూడా దూరమైంది. లావు తగ్గాకే మళ్లీ సినిమాలు చేస్తాననే ఫీలింగ్ లో ఉంది ఈ బ్యూటీ.

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ విషయానికొస్తే ఇప్పటికీ సన్నజాజి తీగలాగే ఉంది. టాప్ హీరోలతో పాటు.. కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసింది.  అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'మన్మథుడు2' తర్వాత సమస్యలొచ్చి పడ్డాయి. రకుల్‌ చాలా ఓల్డ్‌ లుక్‌లో కనిపించిందనే కామెంట్స్‌ వచ్చాయి. ఆ తర్వాత 'చెక్' సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో రకుల్ సినీ కెరీర్ ప్రమదంలో పడింది. ఈ పరిస్థితుల్లో క్రిష్, వైష్ణవ్‌తేజ్‌ సినిమాతో పాటు, 'అక్టోబర్ 31 లేడీస్ నైట్'లో నటిస్తోంది రకుల్. ఈ సినిమాలు అయినా రకుల్ సినీ కెరీర్ ను గాడిలో పెడతాయేమో చూడాలి.


లావణ్య త్రిపాఠి సరైన హిట్‌ సాధించి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతోంది. 'శ్రీరస్తు శుభమస్తు' తర్వాత మధ్యలో వచ్చిన 'అర్జున్ సురవరం' తప్ప మిగిలిన సినిమాలన్నీ లావణ్యను కష్టాల్లోకి నెట్టాయి. 'ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా' సినిమాలతో లావణ్య కెరీర్‌ మరింత కష్టాల్లో పడింది. ఇక ముందైనా ఆమెకు లక్ కలిసొస్తుందేమో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: