స్టైలిష్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి సూపర్ ఫిల్మ్స్ తర్వాత బన్నీ, డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సారి వస్తోన్న చిత్రం ఇది. ఈ మూవీలో రష్మికా మందన్నా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయాలని షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప పార్ట్ 2 లో అత్తారింటికి దారేది ఫేమ్ సీనియర్ నటి నదియా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమె పాత్రపై పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెబుతున్నారు.

ఈమె పాత్ర ఏమిటనేది పక్కాగా తెలియదు కానీ సెట్ లో మాత్రం ఈమె ఈమధ్య కనిపిస్తున్నారని కొందరు అంటున్నారు. దీని ప్రకారం చూస్తుంటే నదియా మరోసారి తన పవర్ ను చూపించనున్నారు. ఒకప్పుడు తెలుగు, మలయాళం, తమిళ్ వంటి బాషల్లో స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ నదియా ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి అత్తారింటికి దారేది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టేశారు. ఆ తర్వాత అ ఆ, దృశ్యం వంటి చిత్రాల్లో తనదైన శైలిలో నటిస్తూ కెరియర్ ని సాఫీగా కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఈమె పుష్ప 2 లో కూడా ఒక కీలకమైన రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ లేదనే చెప్పాలి. ఇక పోతే పుష్ప సినిమా మొదటి భాగాన్ని ఆగస్ట్ లో విడుదల చేయాలని మేకర్స్ కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. విడుదల కాకముందే రికార్డులతో దూసుకుపోతున్న పుష్ప మూవీ విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: