సినీ ఇండస్ట్రీ లో ఎవరు .. ఎప్పుడు.. ఎలా.. తయారవుతారో..? చెప్పడం చాలా కష్టం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాటిని అధిగమించి ముందుకు వెళితేనే మనకు విజయం వరిస్తుంది. కొంతమంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయి సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు.. ఇక ప్రస్తుతం చాలామంది తమ వారసులను సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలని చూస్తుంటే, ఇక్కడ ఒక సీనియర్ నటి మాత్రం తన కూతుర్ని సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంచుతాను అని చెబుతోంది..ఇంతకూ  ఎవరు ఆమె..?ఎందుకు  తన కూతురిని సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంచుతాను అని చెబుతోంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా, సదా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం జయం. ఈ చిత్రంలో హీరోయిన్ కి చెల్లి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది యామినీ శ్వేత.. ఇక ఈ సినిమాలో నటించి ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ యామిని శ్వేత జయం సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. తరువాత ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి , ఎన్నో పై చదువులు చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడింది.. తాజాగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యామిని శ్వేత తల్లి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన జయలక్ష్మి పాల్గొంది.
ఇందులో భాగంగానే జయలక్ష్మి మాట్లాడుతూ.. తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే తన కూతురుని ఇండస్ట్రీకి పరిచయం చేయకూడదని నిశ్చయించుకుందట. తన కూతురు కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే చూడాలని జయం సినిమాలో మాత్రమే నటించేలా చేసిందట.. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉన్నత చదువులు చదివి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని సాగిస్తోంది అంటూ విజయలక్ష్మి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: