రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన మహేష్ ఉత్తమ నటుడిగా తొలి సినిమాతోనే నంది నూతన అవార్డును అందుకున్నాడు. అలాగే 2003లో వచ్చిన నిజం
సినిమా కి మొదటి సారిగా నంది ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. సూపర్ స్టార్
కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మహేష్ బాబు. తనకే సొంతమైన నటనతో ఆటిట్యూడ్ తో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను మార్చుకున్నారు.
తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించడం వల్ల ఆయనకు నటన అబ్బడానికి ఎంతో సమయం పట్టలేదు.
తండ్రి ఆశయాలను తు.చ తప్పకుండా పాటిస్తూ నిర్మాతల
హీరో గా ఎదిగాడు మహేష్. అయితే అదే నిర్మాతలు ఎంత ప్రయత్నించినా కూడా మహేష్ బాబు
రీమేక్ సినిమాల జోలికి మాత్రం వెళ్లలేదు. కారణమేంటో తెలియదు కానీ ఇతర హీరోలు
రీమేక్ సినిమాల మోజులో పడి వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే మహేష్ బాబు మాత్రం స్త్రైట్ సినిమాలనే నమ్ముకున్నాడు. అలా ఆయన చేసిన
సినిమా ప్రయోగాలు కొన్ని విఫలం కాగా కొన్ని
సక్సెస్ అయ్యాయి.
మహేష్ బాబు కెరీర్ లోని చిత్రాలు ఎక్కువగా చేసిన దర్శకుల తోనే చేశాడు. దాంతో ఆయనకు
రీమేక్ సినిమా చేసే అవకాశం లభించలేదు. చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నించిన కూడా ఆయన ససేమిరా అన్నాడు. ఆఖరికి తన
తండ్రి చిత్రాలను కూడా
రీమేక్ చేసే ధైర్యం చేయలేకపోయాడు మహేష్. ఆల్రెడీ చూసిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు వేరే భాషలో చూపించడం వారిని మోసం చేయడం లాంటిది అని మహేష్ బాబు అభిప్రాయం అందుకే తను
రీమేక్ సినిమాలు చేయను అని కంకణం కట్టుకున్నాడు. కానీ
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహితుడు
సినిమా రీమేక్ లో మహేష్ బాబు నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలీవుడ్లో తెరకెక్కిన 3ఇడియట్స్ సినిమాకి ఇది రీమేక్. అయితే ఆఖరికి ఈ సినిమాలో మహేష్ బాబు నటించినని తేల్చి చెప్పాడు. మరి భవిష్యత్తులో కూడా మహేష్ బాబు ఇదే ఆలోచన చేస్తాడా లేదా తన ఆలోచన మార్చుకుని
రీమేక్ సినిమా చేస్తాడా అనేది చూడాలి.