హీరోయిన్ క్యారెక్టర్ కి ఏమాత్రం తగ్గని పాత్ర కావడం, అందులోనూ సినిమాకి ఈ పాత్ర కీలకం అని చెప్పడంతో వెంటనే ఓకే చెప్పారట ఇలియానా. అయితే సైజ్ జీరో నడుముతో యువతను ఉర్రూతలూగించిన ఇలియానా కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో కనిపిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. గతంలో రాఖీ, శక్తి వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించింది ఇలియానా, అయితే ఆ రెండు సినిమాలు ఊహించిన ఫలితాలను అందించలేకపోయాయి. కాగా ఈసారి కొరటాల వంటి డైరెక్షన్ లో తారక్ తో కలిసి నటిస్తే హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ ను అందుకోవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ అది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో కావడంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి