యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో బెస్ట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో డార్లింగ్ సినిమా కూడా ఒకటి. దశాబ్దం క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ యూత్ ఫేవరెట్ సినిమాగా మారింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. కలెక్షన్స్ విషయానికి వస్తే రి రిలీజ్ మొదటి రోజే ఈ సినిమా ఊహించని విధంగా రూ .7 కోట్ల రూపాయలకంటే ఎక్కువగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఇక రెండో రోజు కూడా అదే జోరు కొనసాగడంతో రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మొత్తం మీద రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 9.36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక రీజినల్ సినిమా రీ రిలీజ్ ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం అంటే అది ప్రభాస్ స్టామినాకి నిదర్శనమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్, కాజోల్ మధ్య కెమిస్ట్రీకు కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.


వీటికి తోడు జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకి మరింత ప్లస్ మారింది. ప్రభాస్ కామెడీ టైమింగ్ ,చంద్రమోహన్, ప్రభు నటన ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాలు కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలా మహేష్ బాబు మురారి ,పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ లలో సందడి చేశాయి, ఇప్పుడు ప్రభాస్ నటించిన డార్లింగ్ కూడా సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 తదితర సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: