టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని చూస్తే ఆయన బాలీవుడ్ కూడా కాదు ఏకంగా హాలీవుడ్ లో ఉండవలసిన హీరో అని మనకి అనిపించకమానదు. ఆరడుగుల పైగా ఎత్తు, చూడచక్కని చందమామ వంటి రూపం, తెల్లని మేని ఛాయ వెరసి సూపర్ స్టార్ ని చూస్తే నిజంగా ఇక్కడ ఉండవలసిన స్టార్ కాదేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ సినిమా రాజకుమారుడు మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్, ఆ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు.

అనంతరం ఒక్కొక్కటిగా సినిమా ఛాన్స్ లు అందుకుని వాటి ద్వారా భారీ సక్సెస్ లు దక్కించుకుని కోట్లాదిమంది అభిమానులను సంపాదించి ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు ని నిలబెట్టి దూసుకెళ్తున్నారు మహేష్ బాబు. ఇక ఆయన నుండి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకాభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు అనే చెప్పాలి. ఆ విధంగా గొప్ప పేరు దక్కించుకున్న మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుండగా ఈ మూవీ కోసం పూర్తిగా క్రాఫ్ పెంచి మరింత అందంగా సిద్ధం అయ్యారు మహేష్. ఇక సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కూడా మహేష్ ఖాతాలో ఉన్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వారు ప్రతి ఏడాది బిగ్ బిలియన్ డివైస్ పేరుతో భారీ సెల్ ని నిర్వహిస్తుంటారు.

ఇక ఈ ఏడాది త్వరలో ప్రారంభం కానున్న ఈ భారీ సెల్ కోసం పలువురు స్టార్స్ తో యాడ్స్ తీసి రిలీజ్ చేసిన ఫ్లిప్ కార్ట్ వారు నేడు మహేష్ తో తెలుగు యాడ్ తీసి రిలీజ్ చేసారు. సీనియర్ నటి తులసి తో కలిసి మహేష్ నటించిన ఈ యాడ్ ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ యాడ్ లో మహేష్ బాబు ఎంతో అందంగా కనపడ్డారు. లేటెస్ట్ హెయిర్ స్టైల్ తో పాటు ట్రెండీ స్టైల్ దుస్తులు ధరించి మహేష్ చేసిన ఈ యాడ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో మహేష్ ని చూస్తుంటే ఆయనకు వయసు రోజురోజుకు తగ్గుతున్నట్లు అనిపిస్తోందని, సర్ ఇంతకీ మీరు ఏమి తింటారో మాకు చెప్తే మేము కూడా అవే తింటాము అంటూ మహేష్ ని ఉద్దేశించి సరదాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: