నయనతార కెరీర్‌ స్టార్ట్‌ చేసి 18ఏళ్లు దాటింది. ఈ లాంగ్‌ జర్నీలో నయన్‌ తెలుగు, తమిళ్, మళయాళం అంటూ సౌత్‌ సినిమాలే చేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత నయనతార ముంబయిలో అడుగుపెట్టింది. అది కూడా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కలిసి సినిమా చేస్తోంది. అట్లీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఒక మాస్‌ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతోనే నయనతార హిందీకి వెళ్తోంది. రష్మిక మందన్నకి తెలుగు సూపర్ స్టార్డమ్‌ వచ్చాక కన్నడ సినిమాలు తగ్గించింది. ఆ తర్వాత తమిళ్లోనూ సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మికకి హిందీలో కూడా క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి 'మిషన్‌ మజ్ను' అనే సినిమా చేస్తోంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌తో 'గుడ్‌బై' అనే మూవీ చేస్తోంది రష్మిక.

సమంత 'ఫ్యామిలీమెన్2' వెబ్‌ సీరీస్‌తో నార్త్ ఆడియన్స్‌ని పలకరించింది. ఇక ఈ సీరీస్‌లో సామ్‌ పెర్ఫామెన్స్‌కి నార్త్‌ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అలాగే బాలీవుడ్‌ మేకర్స్ కూడా సామ్‌తో సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారట. అందుకే సమంత కూడా ముంబయిలో ఇల్లు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. హిందీ సినిమాల్లో సౌత్‌ హీరోయిన్ల డామినేషన్‌ ఎప్పటినుంచో ఉంది. రేఖ, శ్రీదేవి, జయప్రద నుంచి మొదలుపెడితే దీపిక పదుకొణే వరకు చాలామంది హీరోయిన్లు ఇప్పటికీ బీటౌన్‌ని రూల్‌ చేస్తూనే ఉన్నారు. మరి మన దగ్గరి నుంచి బాలీవుడ్‌కి వెళ్తోన్న హీరోయిన్లలో ఎంతమంది స్టార్డమ్‌ సంపాదించుకుంటారో చూడాలి.

కమల్ హాసన్ కూతురు శ్రుతీ హాసన్‌ హిందీ సినిమాలతోనే కెరీర్‌ స్టార్ట్ చేసింది. 'లక్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్షయ్‌ కుమార్, జాన్ అబ్రహం లాంటి వాళ్లతో సినిమాలు చేసింది. అయితే హిందీలో స్టార్స్‌తో సినిమాలు చేసినా శ్రుతీ అక్కడ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగు, తమిళ్‌ సినిమాలతో హంగామా చేసిన త్రిష బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్షయ్‌ కుమార్‌తో కలిసి 'కట్టామీటా' అనే సినిమా చేసింది. అయితే ఈ మూవీ తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు. బీటౌన్‌లో కేవలం వన్‌ మూవీ వండర్‌గా మిగిలిపోయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: