మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ కళాత్మకమైన సినిమాలే అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలా కళాత్మకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయ్ అంటే చాలు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను బాగా ఆదరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కళాత్మకమైన సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది నాట్యం అనే సినిమా. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భిన్నమైన టాక్ సొంతం చేసుకుంటూ ఉంది అని చెప్పాలి.



 సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. నిశృంఖల  ఫిలిమ్స్ అనే  నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించింది అని చెప్పాలి. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా డాన్స్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ప్రముఖ కూచిపూడి డాన్సర్ అయిన సంధ్య రాజు ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించింది. ఇక ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే నాట్యమే ప్రధానాంశంగా వచ్చిన ఈ సినిమాపై ప్రస్తుతం ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



 ఇటీవలే నందమూరి బాలకృష్ణ నాట్యం సినిమా గురించి మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు.  'నాట్యం' సినిమా మాత్రమే కాదు ఒక కళాకృతి అంటూ బాలయ్య ప్రశంసలు  కురిపించారు. సినిమా అంటే కేవలం వినోదం కోసం మాత్రమే కాదని..  మరుగున పడిపోతున్న కళలను తెరమీదికి తెచ్చి అందరికీ ఒక సందేశం ఇవ్వడం కూడా సినిమానే అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఇక ప్రతి ఒక్కరు కూడా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి జీవించారు అంటూ బాలయ్య అన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే నాట్యం అనే గ్రామానికి చెందిన సితార తనకు నాట్యం పైన ఉన్న ఆసక్తితో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి విజయాన్ని సాధించడమే ఈ నాట్యం సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: