టాప్ దర్శకులు దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి పూరీ జగన్నాథ్ టాప్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. అలాంటి మేధస్సు గల ఈ టాప్ దర్శకులు అంతా తమ సొంత కొడుకులను హీరోలుగా మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.


ఈ లిస్టులో చివరి వరసలో ఉన్న పూరీ జగన్నాథ్ తన కొడుకును మాస్ హీరోగా నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలలో ఇప్పటి వరకు విజయాన్ని అందుకోలేకపోయాడు. తన కొడుకు ఆకాష్ ను హీరోగా మార్చి ఇప్పటికే పూరీ అనేక సినిమాలు నిర్మించాడు ఆసినిమాలు ఏవీ సక్సస్ కాలేదు.


అయితే పూరీకి ఈ విషయంలో కొన్ని ఆర్ధిక నష్టాలు వచ్చాయి అన్న ప్రచారం కూడ ఉంది. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో పూరీ తన సర్వశక్తులు ధారపోసి ‘రొమాంటిక్’ అన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ తీసాడు. వాస్తవానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి అయింది. కరోనా పరిస్థితులు అడ్డు తగలడంతో ఈసినిమాను అనేకసార్లు వాయిదా వేసి ఇప్పుడు ధైర్యంగా ముందుకు తీసుకు వస్తున్నారు. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదదల అయింది.


ఈ ట్రైలర్ చూసిన పూరీ అభిమానులు కూడ పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం పూరి గతంలో తీసిన ‘నేను నా రాక్ష‌సి’ ‘రోగ్’ లాంటి డిజాస్ట‌ర్ సినిమాల ఛాయలు ‘రొమాంటిక్’ మూవీలో కనిపిస్తాయా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అమ్మాయిని క‌సిగా కొరుక్కుతినేయాల‌న్న‌ట్లు చూసే హీరో నీకేం కావాలని అడుగుతూ అత‌ణ్ని తిట్టిపోసే హీరోయిన్ లాంటి ఓల్డ్ స్టైల్  డైలాగ్స్ సీన్స్ ఈ టీజర్ లో కనిపించడంతో ఇప్పటి తరం ప్రేక్షకులకు ఈమూవీ నచ్చుతుందా అని అనిపించడం సహజం. ఈమూవీలో కూడ  ఒక ద‌శ దాటాక‌ ఇద్ద‌రి మ‌ధ్య ఘాటు రొమాన్స్ ఇలా పూరి తీసిన చాలా సినిమాల టెంప్టేట్ సీన్స్  స్ట‌యిల్ ఈమూవీలో కనిపిస్తూ ఉండటంతో ఆకాష్ కు విజయం ఈసారి అయినా వరిస్తుందా అన్న సందేహాలు రావడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: