అయితే విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం బయటకి చెప్పలేదు. కానీ ఇక వీళ్ళు సోషల్ మీడియా లో పెట్టిన ట్విట్ లు మాత్రం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇకపోతే మంచు మనోజ్ విడాకులు తీసుకున్న తరువాత తన పూర్తిస్థాయి దృష్టి ఇక సినిమాల పైనే ఉంటుందని త్వరలో ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నా అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఇకపోతే అటు సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంచు మనోజ్ విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మనోజ్ దగ్గరికి వెళ్లి నట్టు ఉంది. ఇక వెంటనే తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు మంచు వారి వారసుడు మనోజ్. అంతేకాదు తన దైన శైలిలో సెటైర్ వేశాడు. తన పెళ్ళికి తనను కూడా ఆహ్వానించాలని.. పెళ్లి ఎక్కడో చెప్పాలి అంటూ పంచ్ వేసాడు. ఇంతకీ ఎవరా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం అంటూ ఒక ఎమోజి జత చేసాడు మంచు మనోజ్. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంచు మనోజ్ ఇక ఇటీవలే తన రెండవ పెళ్లి పై చేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి