నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో మంచి విజయం అందుకున్న గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా ఫుల్ బిజీగా షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్న బాలకృష్ణ తాజాగా లో తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపాబుల్ అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన ప్రోమో లను ఆహా నిర్వాహక బృందం బయటకు వదలగా వీటికి జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ షో ఎప్పుడు మొదలవుతుందా.? ఎప్పుడు బాలకృష్ణను ఈ టాక్ షో లో చూస్తామా అని ఎంతోమంది బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు జనం కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న ఎంతో మంది ఎదురు చూపులకు కలం పడే సమయం వచ్చేసింది.

ఈరోజు అనగా దీపావళి సందర్భంగా నవంబర్ 4 వ తేదీన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపాబుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ ప్రారంభం అయ్యింది. ఎపిసోడ్ లో భాగంగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి ఈ టాక్ షో కు గెస్ట్ లుగా విచ్చేశారు. బాలకృష్ణ వీరితో సరదాగా ముచ్చటిస్తూ అనేక విషయాలను చర్చించారు. అందులో భాగంగా మంచు లక్ష్మి బాలకృష్ణ సంస్కారం గురించి ఒక పాత సంఘటనను వివరించింది. దొంగ రాముడు సినిమా సమయంలో మోహన్ బాబు కి దెబ్బ తగిలింది అంట, మెడ మీద ఆ దెబ్బ చూసిన తర్వాత బాలకృష్ణ కంగారు పడిపోయాడు అంట, హాస్పటల్లో బాలకృష్ణ కంగారు చూసి  చచ్చిపోతాడు అని అనుకున్నారట, ఆ తర్వాత ఉస్మాన్ రోడ్డు కు తీసుకు వెళ్లి బొమ్మలు కొనిచ్చి వెంటనే మోహన్ బాబు ఇంటికి వెళ్లి నిర్మల దేవి కి ధైర్యం చెప్పాడట, ఈ సంస్కారం ఈ రోజుల్లో ఎవరికీ లేదు అని మేము ఈ సంఘటన మర్చిపోలేము అంటూ మంచు లక్ష్మి వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: