ఇలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ కూడా ఒకటి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రలో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు ఇద్దరు. ఎవరికివారు సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈ ఇద్దరిలోఉండే ఒక సిమిలారిటీ ఏమిటంటే.. ఇద్దరు కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించగలడు.. అంతేకాదు ఇద్దరి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతుంది. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యువ స్టార్ హీరోలు వచ్చినప్పటికీ వీరిద్దరి కామెడీ టైమింగ్ బీట్ చేయలేరు అని చెప్పాలి.
అలాంటి ఈ ఇద్దరు హీరోలుతెలుగు సినిమాలో కలిసి నటిస్తే.. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు అటు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తే.. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ పండగే పండగ. సాధారణంగానే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే తమ దైన కామెడీ టైమింగ్తో అలరిస్తే ఇక ఆ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇక మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి