‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ ను ఒకనెల ముందుగా ప్రారంభించాలని రాజమౌళి భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి పెద్ద సినిమా అయినప్పటికీ మొదటివారం వచ్చే కలక్షన్స్ అత్యంత కీలకం. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ కు మొదటివారం కలక్షన్స్ తో పాటు జనవరి రెండవ వారంలో రాబోతున్న సంక్రాంతి పండుగ కలక్షన్స్ బోనస్ గా మారనున్నాయి.


ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన విడుదల తేదీని జనవరి 7గా ఫిక్స్ చేసాడు. ఈసినిమా ప్రమోషన్ కోసం కేవలం జూనియర్ రామ్ చరణ్ లు మాత్రమే కాకుండా. సీనియర్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ల సహాయ సహకారాలు కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ కు తోడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈమూవీ ప్రమోషన్ కు ప్రభాస్ ను కూడ రంగంలోకి దింపాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. ఈసంక్రాంతి సీజన్ లో తన ‘రాథే శ్యామ్’ మూవీ ఉన్నప్పటికీ ప్రభాస్ తనకు రాజమౌళితో ఉన్న సాన్నిహిత్యంతో జక్కన్న అడిగితే ప్రభాస్ కూడ ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతి సీజన్ లో తన మూవీ పోటీలో ఉన్నప్పటికీ ప్రభాస్ ఇలా ముందుకు రావడానికి అతడికి రాజమౌళి పట్ల ఉన్న గౌరవం అని అంటున్నారు.


అయితే ఈవిషయంలో జూనియర్ చరణ్ ల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయని అంటున్నారు. ప్రభాస్ సహృదయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రమూట్ చేసినప్పటికీ అతడి అభిమానులు వేరే విధంగా భావిస్తూ ప్రభాస్ ప్రమోట్ చేయడం వలన మాత్రమే ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఆ రేంజ్ లో కలక్షన్స్ వచ్చాయి అని నెగిటివ్ ప్రచారం చేసే ఆస్కారం ఉందని చరణ్ జూనియర్భావన అని టాక్. ఇది ఇలా ఉండగా జూనియర్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు ఆ షో నిర్వాహకులు ప్రభాస్ ను జూనియర్ పక్కన అతిధిగా పిలిచినప్పటికీ ప్రభాస్ వైపు నుండి స్పందన రాలేదు అన్న గుసగుసలు కూడ ఉన్నాయి. దీనితో ప్రభాస్ చేత ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోట్ చేయించాల వద్దా అన్న కన్ఫ్యూజన్ లో రాజమౌళి ఉన్నట్లు టాక్..  మరింత సమాచారం తెలుసుకోండి: