ప్రస్తుతం వెండితెర నటులకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెరపై నటించే నటులకు అంతే క్రేజ్ ఉంది. వెండితెరపై నటించిన నటులు సైతం ప్రస్తుతం బుల్లితెరపై నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బుల్లితెరపైనా ఏ షో జరగాలన్న ముందు ఉండి నడిపించే వ్యక్తి యాంకర్. ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో మంది యాంకర్ లు వారి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆలా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ శ్యామల గురించి తెలియని వారంటూ ఉండరు.

బుల్లితెరపై యాంకర్ సుమ తర్వాత ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న యాంకర్ గా శ్యామల పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆమె బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉండడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేస్తూ ఉంది.

ఇక ఇదిలా ఉండగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. అయితే అభిమానులతో ముచ్చటించిన ఈమెకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు అడిగారు. ఈ తరుణంలో ఒక నెటిజన్ మీ మొదటి లవర్ ఎవరు అంటూ ప్రశ్నించగా అందుకు సమాధానం చెబుతూ తన భర్త నరసింహా రెడ్డి ఫోటోలు షేర్ చేసింది. అంతేకాక.. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అంటూ తన భర్త గురించి వెల్లడించింది. అయితే మరొక నెటిజన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా అని అడిగా అందుకు ఆమె నో అంటూ తల ఊపింది శ్యామల.

అయితే అదే విధంగా మరోకు మీకు హీరోయిన్ గా అవకాశం వస్తే నటిస్తారా అంటూ ప్రశ్న అడిగారు. ఇక శ్యామల నటించనని సమాధానం చెప్పుకొచ్చారు. అంతేకాక..  తన భర్త గత కొద్ది రోజుల క్రితం ఒక మహిళ డబ్బు విషయంలో భాగంగా తనను మోసం చేశాడంటూ శ్యామల భర్త పై కేసు నమోదయిన సంగతి అందరికి తెల్సిన విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: