సినిమా అయినా రిలీజ్ చేయాలంటే దానికి ఓ ప‌ద్ధ‌తి, పాడు ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ సినిమా పెద్దది కావ‌చ్చు.. చిన్న‌ది కావ‌చ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ముందు జ‌నాల‌కు రీచ్ కావాల్సి ఉంటుంది. అందుకే త‌గిన క్ర‌మ ప‌ద్ధ‌తిలో ప్ర‌చారం చేయాల్సి ఉంది. ఒక్కో సారి చిన్న సినిమాల‌కు కూడా పెద్ద హీరోలు ఎంత‌లా ప్ర‌చారం చేస్తారో తెలిసిందే. అలా చేస్తే త‌ప్పా మినిమ‌మ్ ఓపెనింగ్స్ కూడా రావు. ఇప్ప‌టి సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌చారం విష‌యంలో ముందు నుంచే చాలా ప్రీ ప్లాన్డ్ గా వ్య‌వ‌హ‌రించాలి.

అలాంటి ది ఓ పెద్ద హీరో కు చెందిన పెద్ద బ్యాన‌ర్లో తెర‌కెక్కిన సినిమాకు ఎంత‌ల ప్ర‌చారం ఉండాలి. ఆ హీరో చిన్న వాడే కావ‌చ్చు.. కానీ ఆ బ్యాన‌ర్  ప్ర‌చారం విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు మాత్రం ఎంత మాత్రం స‌రిగా లేద‌నే అంటున్నారు. నాగ్ త‌న సొంత బ్యాన‌ర్ అయిన అన్న‌పూర్ణ బ్యాన‌ర్ మీద అనుభవించు రాజా సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

నాగ్ మేన‌కోడ‌లు సుప్రియ ఈ సినిమాకు ఎగ్జిగ్యూటివ్ నిర్మాత‌. కేవ‌లం హీరో, హీరోయిన్ల తో ప్రెస్ మీట్లు, గేమ్ షోలు మిన‌హా అంత‌కు మించి ప‌బ్లిసిటీ చేయ‌డం లేదు. నాగార్జున నిర్మాత గా ఉండి కూడా ప‌ట్టించు కోవడం లేదు. ఆ కుటుంబం లోనే నాగ‌చైత‌న్య‌, అఖిల్ లాంటి ఇద్ద‌రు క్రేజీ హీరోలు కూడా ఉన్నారు. నాగ్ చెపితే ఏ పెద్ద హీరో అయినా ఈ సినిమా గురించి త‌న వంతుగా ప్ర‌మోష‌న్ చేస్తాడు.

క‌నీసం అలా కూడా చేయ‌డం లేదు. ఏదో బిగ్ బాస్ షోల ఈ సినిమా టీంను తీసుకు వెళ్లి ప‌రిచ‌యం చేసి మ‌మః అనిపించేశారు. అంత వ‌ర‌కు ఆ త‌ర్వాత గాలికి వ‌దిలేశారు. చాలా పూర్ బ‌జ్‌తో ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. రాజ్ తరుణ్ లాంటి చిన్న హీరో, చిన్న దర్శకుడు అయినా ప‌క్కా ప్లాన్ తో వ్య‌వ‌హ‌రించి ఉంటే సినిమాకు క్రేజ్ వ‌చ్చేది .. కానీ అలా చేయ‌డంలో విఫ‌ల‌మ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: