ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ప్రముఖ సినీ సెలబ్రిటీ షో బిగ్ బాస్ బిగ్. బిగ్ బాస్ 5 సీజన్  బుల్లితెరపై ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఎంతో అద్భుతంగా అలరిస్తూ ఉంది . ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి అంతకంతకూ క్రేజ్ పెరిగిపోతోంది ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తుంది బిగ్బాస్ కార్యక్రమం.  ఇక ఈ ఐదో సీజన్ కూడా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగా ప్రస్తుతం ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు.


 ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది   గతవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం మాత్రం అందరికీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా మారిపోయింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అంటే చాలు ఒక్క సారిగా వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఒకరి గురించి ఒకరు కామెంట్లు చేసుకుంటూ నామినేట్ ఉంటారు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏడు మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్ ఫోటోలు ఉన్న బాల్స్ ను బిగ్బాస్ ఇంటి మెయిన్ గేటు వైపు కాలితో తనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అందరూ ఈ నామినేషన్ ప్రక్రియ లో పాల్గొని ఇక ఇతర కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు.  అయితే ప్రియాంక ఎప్పటిలాగానే తన దగ్గర ఇంటి సభ్యులను నామినేట్ చేయడానికి బలమైన కారణం ఏంటి లేదు అంటూ చెప్పింది. బిగ్బాస్ నాకు కాస్త సమయం కావాలి అంటూ అడిగింది..  వెంటనే షణ్ముక్  స్పందిస్తూ చెప్పాలి పింకీ అంటూ చెప్పాడు. నువ్వు నామినేషన్ లో ఉంటే నిన్నే నామినేట్ చేసేదాన్ని అంటూ ముఖం మీద చెప్పేసింది ప్రియాంక. ఇక వెంటనే బిగ్బాస్ కలుగ చేసుకున్నాడు.  ప్రియాంక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రియాంక బిగ్ బాస్ మిమ్మల్ని చివరిసారిగా హెచ్చరిస్తున్నాడు మీరు కనుక ఇప్పుడు ఎవరిని నామినేట్ చేయకపోతే నేరుగా మీరు నామినేషన్ లోకి వెళ్తారు అంటూ హెచ్చరించారు బిగ్ బాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: