మహేష్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలలో నటించలేదు. బాలీవుడ్ సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదు అని కూడ అనేకసార్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు రాజమౌళి సినిమాలో మహేష్ నటించబోతున్నాడు కాబట్టి అతడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడి పాన్ ఇండియా ఎంట్రీ మటుకు తప్పనిసరి పరిస్థితి.
ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ మహేష్ ల మూవీ పై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వస్తోంది. త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ అతడితో చర్చలు జరపడం అతడు అంగీకరించడం జరిగిపోయింది అంటున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీకి సంబంధించి నటీనటుల ఎంపిక కూడ మొదలైంది.
ఈమూవీలో సెకండ్ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేయాలని ప్రయత్నించినప్పటికీ ఈవిషయమై మహేష్ అభిమానులు గగ్గోలు పెట్టడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ లో అధీరాగా నటిస్తున్నాడు. ఈమూవీలోని అతడి లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. సంజయ్ దత్ గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన ‘చంద్రలేఖ’ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అనేకమంది బాలీవుడ్ హీరోలు విలన్స్ గా మారి తెలుగు సినిమాలలో స్థిరపడిన విలన్స్ కు గట్టిపోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా వీరి పోటీతో జగపతి బాబుకు అవకాశాలు కొంతవరకు తగ్గాయి. లేటెస్ట్ గా ‘అఖండ’ మూవీతో శ్రీకాంత్ విలన్ ఎంట్రీ సగటు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో శ్రీకాంత్ కు బాగా అవకాశాలు వస్తాయని భావించారు. అయితే త్రివిక్రమ్ ఆలోచనలు మాత్రం సంజయ్ దత్ వైపు వెళ్ళడం వెనుక మహేష్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేయాలి అన్న వ్యూహం కూడ ఉంది అని అనిపిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి