‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ అతిధిగా రావడమే కాకుండా బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించి మెగా అభిమానులకు బన్నీ షాక్ ఇచ్చాడు. ఈ ఈవెంట్ జరిగిన కొన్ని రోజులకు నిర్వహింపబడ్డ ‘పుష్ప’ ఈవెంట్ లో కూడ బన్నీ తాను అందరివాడిని అని తెలియచేసే విధంగా తన ‘పుష్ప’ నుండి సంక్రాంతి రేస్ వరకు విడుదల కాబోతున్న సినిమాల పేర్లు అన్నీ వరసగా చెప్పి ఆ సినిమాలు అన్నీ ఘన విజయం సాధించాలని తన నిండు మనసును చాటుకున్నాడు.


అంతేకాదు వేదిక ఎక్కితే చాలు గతంలో నిరంతరం చిరంజీవి నామస్మరణ చేసే బన్నీ ఈసారి ఎక్కడా తన ఉపన్యాసంలో చిరంజీవి పై పొగడ్తల వర్షం బాగా తగ్గించడం మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ ఈవెంట్ కు చిరంజీవి అతిధిగా రాకపోవడం మెగా అభిమానులకు మరింత షాక్ ఇచ్చింది.


దీనికితోడు ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకులు అందరు అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించడంతో బన్నీ చాల వ్యూహాత్మకంగా టాప్ దర్శకులతో తన సాన్నిహిత్యాన్ని మరింత పెంచుకుంటున్నాడా అని అనిపిస్తోంది అంటూ మెగా అభిమానులు భావించినట్లు టాక్. ఈపరిస్థితుల మధ్య అల్లు అర్జున్ ‘అఖండ’ టీమ్ కు ఒక భారీ డిన్నర్ పార్టీ ఇవ్వబోతున్నాడు అని వస్తున్న వార్తలు మరింత షాకింగ్ గా మారాయి. ఇప్పటికే అల్లు కాంపౌండ్ బాలయ్యల మధ్య చాల మంచి సాన్నిహిత్యం రోజురోజుకు పెరుగుతోంది.


ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా బాలకృష్ణ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో పాటు ఆహా సిరీస్ కు హోస్ట్ చేయడంతో ఇప్పుడు బాలయ్య అల్లు కాంపౌండ్ ల మధ్య సాన్నిహిత్యం మరింత షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ సాన్నిహిత్యం ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో బాలకృష్ణ అల్లు అర్జున్ లతో ఒక మల్టీ స్టారర్ వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి..








మరింత సమాచారం తెలుసుకోండి: