ఈమూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలైన పరిస్థితులలో ఈమూవీని అల్లు అర్జున్ బెంగుళూరులో కూడ తన శక్తిమేరకు ప్రమోట్ చేసాడు. అంతేకాదు తన పై అసహనాన్ని వ్యక్తపరిచిన కన్నడ మీడియాకు సారి చెప్పి వారి మెప్పును కూడ పొందడానికి చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. ఇంత ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరు కన్నడ ప్రజలు ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ను ప్రచారంలోకి తీసుకు రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది.
‘పుష్ప’ కన్నడ వెర్షన్ కి మించి తెలుగు వెర్షన్ కి కర్ణాటకలో అత్యధిక థియేటర్లు ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం కన్నడ ప్రజలని అవమానించడమే అవుతుందంటూ కొంతమంది కన్నడ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. బెంగుళూరులో 95 శాతం థియేటర్లు తెలుగు వెర్షన్ ‘పుష్ప’ తో ఫుల్ అయిపోయాయి. టిక్కెట్స్ కూడా భారీ స్థాయిలో బుక్ అయ్యాయి.
దీనితో ఈసినిమా కన్నడ వెర్షన్ కు కంటే తెలుగు వెర్షన్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీనికి కారణం ముందు కర్ణాటకలో ‘పుష్ప’ డబ్బింగ్ వెర్షన్ కి పెద్దగా డిమాండ్ ఏర్పడలేదట. దీనితో ధియేటర్లు అన్నీ తెలుగు వెర్షన్ తో నింపేసి కన్నడ వెర్షన్ కు తక్కువ థియేటర్లు కేటాయించారని ఈవిధానం తమకు అవమానం అంటూ సోషల్ మీడయా వేదికగా #BoycottPushpaInKannada అంటూ ప్రచారం ప్రారంభం అవ్వడంతో పాన్ ఇండియా స్టార్ గా మారాలని ప్రయత్నిస్తున్న బన్నీ ఆశలకు తొలిరోజే అడ్డంకులు ఏర్పడ్డాయి అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి