ఇక ఫైనల్ గా కప్ అందుకున్న సన్నీ విన్నర్ స్పీచ్ ఇస్తూ.. తనకు ఓటూ వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక అలాగే తనకు హౌస్ లో సపోర్ట్ చేసిన కంటెస్టెంట్లు అందరికి కూడా ధ్యాంక్స్ చెప్పారు. ఇక సిరి-షణ్ముఖ్ ల గురించి మాట్లాడుతూ వాళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుతూ.. సన్నీ-మానస్ లాగనే సిరి-షణ్ముఖ్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీని బట్టి సన్నీ క్యారెక్టర్ ఏంటో అర్ధం చేసుకోండి అంటూ సన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సన్నీ మరోసారి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
నిజానికి హౌస్ లో మొదటి నుంచి సిరి-షణ్ముఖ్ కి సన్నీ అంటే అసలు పడడంలేదు. కావలనే ప్రతి టాస్క్ లో కూడా టార్గెట్ చేస్తూ.. సన్నీకి కోపం వచ్చేలా చేసారు అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే సన్నీకి కోపం వస్తే కంట్రోల్ అవ్వడం కష్టం..అప్పుడు టంగ్ స్లిప్ అవుతారు..దీంతో సన్నీ ని బ్యాడ్ చెయ్యచ్చు అంటూ సిరి ప్లాన్ చేసిందంటున్నారు సన్నీ అభిమానులు. కానీ అమ్మకి ఇచ్చిన మాట కోసం ..నాగార్జున చెప్పిన్నట్లు కోపాని కంట్రోల్ చేసుకుని..ప్రతి టాస్కులో బెస్ట్ ఇస్తూ..ఫైనల్ గా కప్ గెలిచి.."కప్పు ముఖ్యం బిగిలూ" అంటూ అందరికి మచ్చ అయ్యాడు ఈ బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి