ఎంతో భారీ వ్యయంతో ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఎంతో అత్యున్నతంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు చేస్తుండగా తెలుగు నటులు ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇక అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ తాము ముందుగా ప్రకటించిన విధంగానే పక్కాగా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది అంటూ నిన్న యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరో యాష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్ నిన్నటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతూ ఉండగా నిన్న ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్వీటర్లో ఏకంగా వన్ మిలియన్ కి పైగా ట్రెండ్ అయి ఒక నూతన రికార్డు ని సృష్టించింది.
దీనిని బట్టి పలువురు ప్రేక్షకాభిమానులు ఈ మూవీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని, ఇక రిలీజ్ తరువాత కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ అందరి అంచనాలు అందుకుంటే పెద్ద రికార్డులు నెలకొల్పే అవకాశం కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మూవీ ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక మూడు నెలలు ఓపికపట్టాల్సిందే.