సినిమా వాళ్ళు ఏది మాట్లాడినా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు అందరూ కూడా కాస్త ఆచితూచి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సినిమా వాళ్లు అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. దీంతో ఇక ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వారసుడిగా ఇటీవలే ఆశిష్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలె ఈ సినిమా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు అటు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్లు ఉండడంతో ఈ సినిమా మొదటి నుంచి కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.


 సాధారణంగా సినిమాలు విడుదలైన సమయంలో చిత్రబృందం థియేటర్కు వెళ్లి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సినిమా చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆశిష్ రెడ్డి  హీరోగా పరిచయమైన బ్యాడ్ బాయ్స్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు థియేటర్ కు వెళ్లి సినిమా చూశారు. తర్వాత సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా దిల్ రాజును గుర్తించింది. దీంతో కారులో ఎక్కేందుకు  వెళ్తున్న దిల్రాజును ఆపి మరి కొన్ని ప్రశ్నలు అడిగారు రిపోర్టర్లు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అసలు ఏముంది ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి తీశారు అంటూ ఒక రిపోర్టర్ అడగడంతో దిల్రాజు అసహనానికి గురయ్యారు. నచ్చితే సినిమా చూడండి అంటూ కామెంట్ చేశారు దిల్ రాజు.  దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: