నందమూరి వారసుడు, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడు ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు బాలయ్య. ఇలా దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ కు సంబంధించి కొన్ని ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యామిలీ అంతా కారంచెడు లో ఉంది. ఇక అక్కడ బాలకృష్ణ పెద్ద బావ అయినటువంటి వెంకటేశ్వరరావు ఉన్నారు.ఇక అక్కడే బాలకృష్ణ ఫ్యామిలీ అంతా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఇదే సందర్భంలో బాలయ్య గుర్రం ఎక్కి సందడి చేయడం కూడా జరిగింది. ఇక అలాంటప్పుడే తన కుమారుడు మోక్షజ్ఞ కూడా గుర్రం దగ్గర ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూస్తే మోక్షజ్ఞ.. కాస్త ఫిట్నెస్ గా కనిపిస్తూ, గతంలో కంటే ఇప్పుడు కాస్త సన్నగా కనిపిస్తూ.. తమ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించేలా చేశారు. దీంతో బాలయ్య అభిమానులు తన కుమారుడిని సినిమా ఎంట్రీ కోసం సిద్ధం చేశారని అనుకుంటూ ఉన్నారు. వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో కావాల్సి ఉంది. ఇక బాలకృష్ణ కూడా ఆదిత్య -369 సినిమా సీక్వెల్ లో హీరోగా తన కొడుకే అని గతంలో ఎన్నోసార్లు తెలియజేశాడు.ఇక ఆ సినిమాకి బాలకృష్ణని డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నానని అప్పట్లో తెలియజేయడం జరిగింది. కరోనా పరిస్థితులు ప్రభావం వల్ల బాలకృష్ణ సినిమా లలో బిజీగా మారిపోయారు. ఇక బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి పట్టించుకోకుండా వదిలేశాడు. ప్రస్తుతం అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాగానే సిద్ధమయ్యాడని వార్తలు వస్తున్నప్పటికీ.. బాలయ్య అందుకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారో అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: