దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాను  కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో కరోనా విజృంభించడంతో ఈ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం తెలియజేసింది. అయితే ఈ సినిమాతో పాటే ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం తెలియజేసింది, అయితే ఈ సినిమాను కూడా కరోనా కారణం వల్ల విడుదలను వాయిదా వేశారు.

 అయితే ఇప్పటివరకు ఈ రెండు పాన్ ఇండియా సినిమాల కొత్త విడుదల తేదీలను ప్రకటించలేదు, అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తున్నాయి, అయితే అందులో భాగంగా ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాదే శ్యామ్ సినిమాను మార్చి 18 వ తేదీన విడుదల చేయడం కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా పలు కథనాలు బయటికి వస్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: