కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. నటనతో తన డాన్స్ లతో కూడా అభిమానులకు సూపర్ హీరోగా మారిపోయాడు. కేవలం సినిమా హీరోగా మాత్రమే కాకుండా  గొప్ప మనసుతో ఎంతోమంది పేద ప్రజలకు మనసున దేవుడిగా మారిపోయారు పునీత్ రాజ్కుమార్. చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరో గా కొనసాగుతున్న సమయంలోనే పునీత్ రాజ్కుమార్ హఠాత్మరణం అభిమానులను కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న పునీత్ రాజ్కుమార్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు.



  గొప్ప హీరో అంతకంటే గొప్ప మనసున్న వ్యక్తి పునీత్ రాజ్కుమార్ హఠాత్ మరణం చెందడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది అనే చెప్పాలి.. ఇక సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలను ఇక చూడలేము అన్న విషయాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటికి పునీత్ రాజ్కుమార్ జ్ఞాపకాల్లోనే అభిమానులు బ్రతుకుతున్నారు అని చెప్పాలి. పునీత్ రాజ్కుమార్ హటాత్ మరణానికి ముందు కొన్ని సినిమాల్లో నటించారు. ఇక ఆ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇకపోతే ఇటీవల గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి సినిమా పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం.



 పునీత్ హటాత్ మరణానికి ముందు జేమ్స్ అనే సినిమాలో నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు ఇక ఈ పోస్టర్ లో పునీత్ రాజ్ కుమార్ ఒక సైనికుడి పాత్రలో కనిపిస్తున్నారు. అంతేకాదు ఇక ఈ సినిమాలో పునీత్ సోదరుడు అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్, శివ రాజ్ కుమార్ లు కూడా నటిస్తూ ఉండటం గమనార్హం. పునీత్ పుట్టిన రోజైన మార్చి 17వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చిత్రబృందం ప్రకటించింది . ఇక ఈ సినిమా కోసం అభిమానులు అందరూ వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: