సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న కొండా సినిమా ఇప్పుడు వివాద‌స్ప‌ద‌మ‌వుతోంది. ఈ చిత్రంపై  కొంద‌రూ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. రామ్‌గోపాల్ వ‌ర్మ ఈ సినిమాలో ఏమి చెప్పారు..?  కొండా దంప‌తుల‌ను హీరోగా చిత్రీక‌రించారా..?  ముఖ్యంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు టార్గెట్ అయ్యారా అనే చ‌ర్చ కొన‌సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను వ‌రంగ‌ల్‌లో విడుద‌ల చేసేందుకు ఎర్ర‌బెల్లి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌నే వార్త‌లు వినిపించాయి.

కొండా ముర‌ళి, సురేఖ‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ లేకుండానే పాలిటిక్స్‌లో పైక ఎదిగారు. కొండా సురేఖ ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలవ‌గా.. ముర‌ళి ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి ముఖ్యఅనుచరులు ఉండేవారు. వీరి రాజకీయ జీవిత చ‌రిత్ర వ‌ర్మ‌ను ఆక‌ర్షించింది. న‌క్సలైట్ అధినేత ఆర్‌.కే. తో కొండా ముర‌ళి న‌డిపిన డీల్, స‌ర్పంచ్ నుంచి వ‌రంగ‌ల్ జిల్లాను ఏలేంత‌గా ఎదిగిన ప్ర‌స్థానం, హీరో టైప్ రౌడీ పాలిటిక్స్ ను రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను ఆక‌ర్షించాయి. కొండా టైటిల్‌తో కాక పుట్టించి కేక పెట్టించే విధంగా సినిమా తీసారు.

ముఖ్యంగా కొండా ముర‌ళి అధికారం చేతిలో ఉన్న‌ప్పుడు అప్ప‌ట్లో టీడీపీ నేత అయిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నాలు చేసేవార‌ట‌. మ‌రొక వైపు టీడీపీ అధికారంలోకి వ‌స్తే.. కొండా ముర‌ళీని అణ‌గ‌దొక్కేందుకు ఎర్ర‌బెల్లి అడుగులు వేసేవార‌ట‌. కొండా మూవీలో ఎర్ర‌బెల్లి రోల్‌ను న‌ల్ల‌బ‌ల్లి సుధాక‌ర్‌గా నెగిటివ్ రోల్ చూపించిన‌ట్టు తెలుస్తోంది. ఒక అమ్మ‌కు, నాన్న‌కు పుట్టిన‌వాడినంటూ.. చెప్పే డైలాగ్ ఎర్ర‌బెల్లి క్యారెక్ట‌ర్ చేత చెప్పించ‌డంలో కాంట్ర‌వ‌ర్సీ పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా కొండా ముర‌ళి, ఎర్ర‌బెల్లి మ‌ధ్య పొలికల్ వార్ ఓ రేంజ్‌లో కొన‌సాగింది.

 ముఖ్యంగా వ‌రంగ‌ల్ జిల్లా ర‌క్త చరిత్ర‌లో కొండా ముర‌ళీ పాత్ర క‌నిపిస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో ఉన్న ముర‌ళిని న‌క్స‌లైట్లు ఏమి చేయ‌లేక‌పోయారు. ఆ కాల్పుల్లో ఆయ‌న త‌ల‌లోకి ఓ తూట ముక్క దూసుకెళ్లింది. కొండా ముర‌ళీ త‌ల‌లో అదేవిధంగా ఉంది. కొండా ముర‌ళీ జీవితంలో ఇలాంటి ఖ‌త‌ర్నాక్ సీన్లుంటే ఆర్జీవీ దృష్టిలో ప‌డ‌కుండా ఎలా ఉంటారు..?  ట్రైల‌ర్‌లో కొండాపై కాల్పుల సీన్ ఉంది. ముఖ్యంగా కొండా జీవితంలో కొన్ని పాజిటివ్‌, కొన్ని నెగిటివ్ రోల్ క‌నిపిస్తుంది. ఆర్జీవీ ఈ మంచి-చెడుల‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: